గ్లోబల్‌స్టార్ ప్రియాంకచోప్రా, హాలీవుడ్ నటుడు, పాప్‌సింగర్ నిక్‌జోనాస్‌ను అన్యోన్య దంపతులుగా అభివర్ణిస్తారు. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ప్రియాంకచోప్రా చేసిన తాజా మార్పు ఈ జంట బంధంపై అనుమానాల్ని రేకెత్తించేలా ఉంది. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన పేరు చివర ఉన్న జోనాస్ పేరును ప్రియాంకచోప్రా తీసివేసింది. దీంతో వారిద్దరి వైవాహిక బంధంలో ఏమైనా అభిప్రాయభేదాలు వచ్చాయేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రియాంక, నిక్‌జోనాస్ మూడేళ్ల వివాహబంధం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగిపోతున్నది. భర్తతో అమెరికాలో సెటిలైపోయిన ప్రియాంకచోప్రా ఇటీవల అక్కడే విలాసవంతమైన గృహాన్ని నిర్మించుకుంది. తామిద్దరం కలిసి కట్టుకున్న అందాల పొదరిల్లు ఇదని కొత్త ఇంటి గురించి మురిసిపోయింది ప్రియాంకచోప్రా. దీపావళి పర్వదినం సందర్భంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్ని పాటిస్తూ వైభవంగా గృహ ప్రవేశ వేడుకను కూడా నిర్వహించారు. ఇలాంటి తరుణంలో ప్రియాంకచోప్రా ఇన్‌స్ట్రాగామ్ హ్యాండిల్లో భర్త పేరు తీసివేయడం అనుమానాల్ని పెంచుతున్నది. ఈ విషయంపై ప్రియాంకచోప్రా నుంచి స్పందన వచ్చేదాకా వేచిచూడాల్సిందే అంటున్నారు.