Niharika-Chaitanya Divorce |ఇండస్ట్రీలో మరో జంట విడిపోయింది. ముచ్చటగా మూడేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్నారు నిహారిక, చైతన్య. 2020 డిసెంబర్లో వీళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెగా కుటుంబం అంతా కలిసి ఒక పండగలా పెళ్లి వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. కరోనా సమయంలో కూడా ఖర్చుకు వెనకాడకుండా కోటలో వీళ్ళ పెళ్లి జరిగింది. అప్పట్లో నిహారిక చైతన్య పెళ్లి గురించి నేషనల్ మీడియా కూడా కవరేజ్ చేసిందంటే ఏ రేంజ్లో వీళ్ళ పెళ్లి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మ్యారేజ్ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నా.. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ముఖ్యంగా క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఒకరి మధ్య ఒకరికి గొడవలు ఎక్కువైనట్టు తెలుస్తుంది. చైతన్య సాఫ్ట్వేర్ ఫీల్డ్ కావడం.. నిహారిక సినిమా ఇండస్ట్రీ నుంచి రావడంతో ఇద్దరికీ అభిప్రాయ బేధాలు ఎక్కువగా వచ్చాయని ప్రచారం జరుగుతుంది.
అందుకే కొన్ని రోజులు కూర్చొని మాట్లాడుకోవాలని అనుకున్నా కూడా పరిష్కారం కాకపోవడంతో చివరికి విడాకుల బాట పట్టారు ఈ ఇద్దరు. అధికారికంగా విడాకులు ఇప్పుడు మంజూరు అయ్యాయి.. కానీ చాలా రోజులుగా వీళ్ళు ఇద్దరు వేరువేరుగానే ఉంటున్నారు. అందుకే నిహారిక మునుపటిలా మళ్ళీ సినిమాలు చేస్తూ, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు ఫోటోషూట్స్ కానీ, సినిమాలు గానీ ఏమీ చేయలేదు నిహారిక. దీన్ని బట్టి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని కండిషన్ పెట్టారేమో అని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి నిహారిక ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి ఉంటాయని వార్తలు ధారాళంగా వ్యాపిస్తున్నాయి.
పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను.. ఇండస్ట్రీలోనే ఉంటాను అనే ఒప్పందం పైన చైతన్య నిహారిక పెళ్లి జరిగిందని అప్పట్లో ఇండస్ట్రీలో ప్రచారం బాగానే జరిగింది. కొన్ని రోజులు అది బాగానే ఉన్నా.. ఆ తర్వాత అదే తీవ్ర మనస్పర్ధలు రావడానికి కారణంగా తెలుస్తోంది. ఒకరితో ఒకరు కలిసి ఉండలేం అని నిర్ణయించుకున్న తర్వాత విడిపోవాలని విడాకులకు అప్లై చేసుకున్నారు ఈ జంట. మే 19న కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్న వీళ్ళకు.. తాజాగా డివోర్స్ మంజూరు చేసింది కోర్టు. దాంతో అధికారికంగా ఇద్దరు విడిపోయారు. కొన్ని రోజులుగా మళ్లీ తన కెరీర్ తో బిజీ అయిపోయింది నిహారిక. ఈ మధ్య హాట్ స్టార్‌లో డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. దాంతో పాటు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ కూడా చేసి అప్లోడ్ చేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే విడాకులు ఈమె పెద్దగా ప్రభావం చూపించినట్టు కూడా అనిపించడం లేదు.
మరోవైపు చైతన్య కూడా మీడియాకు దూరంగానే ఉంటున్నాడు. ఏదేమైనా మెగా కుటుంబంలో మరో విడాకులు కూడా రావడంతో అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. గతంలో ఇదే కుటుంబం నుంచి చిరంజీవి కూతురు శ్రీజ, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ అమ్మగారు కూడా విడాకులు తీసుకున్నారు.