Vishwak sen | ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కాస్తో కూస్తో దూకుడు చూపిస్తున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది విశ్వక్ సేనే. ఓ వైపు నటుడిగా మరో వైపు దర్శకుడిగా విశ్వక్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఈ మధ్యే ఆయన నటిస్తూ, దర్శకత్వం వహించిన దాస్ కా ధమ్కీ విడుదలైంది. తొలిరోజే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేవి లేకపోవడంతో వారం వరకు బాగానే లాక్కొచ్చింది. ఇటీవల ఓటీటీలో రిలీజై అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం విశ్వక్ చేతిలో మూడు సినిమాలున్నాయి. కాగా విశ్వక్‌కు దర్శకుడు పూరి జగన్నాథ్ అవకాశం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే దీనిపై పూరి టీమ్ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. అవన్నీ రూమర్స్ అని, అలాంటి పుకార్లను నమ్మొద్దని చెప్పింది. కాగా గతేడాది లైగర్‌తో పూరి భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఈ సినిమా విజయం సాధించి ఉంటే కచ్చితంగా ఈ రోజు పూరీ రేంజ్ మరోలా ఉండేది. పాన్ ఇండియా దర్శకుడు అంటూ ఒక ముద్రపడేది. అయితే ఊహించని విధంగా లైగర్ ఫ్లాప్ కావడంతో.. నెక్స్ట్ ఏంటి అని తెలియని కన్ఫ్యూజన్లో పడిపోయాడు. విజయ్‌తో పట్టాలెక్కించిన ‘జనగనమణ’ మధ్యలోనే ఆగిపోయింది. దాంతో పూరి తదుపరి సినిమాపై ఎలాంటి క్లారిటీ లేదు. ఆ మధ్యన బాలయ్యతో రెండో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన దానిపై ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు.ఇక చిరుతో పూరి తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరిగినా.. ఇంత వరకు దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మరి పూరి తన తదుపరి సినిమాను ఎవరితో చేస్తున్నాడో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.