పవన్ కళ్యాణ్ నిర్మాతలకు తిప్పలు మొదలయ్యాయా..

Power star pawan kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆయన డేట్స్ ఇస్తే చాలు పండగ చేసుకుంటారు. ఇంకా చెప్పాలి అంటే ఎంతైనా రెమ్యునరేషన్ ఇవ్వడానికి అయినా క్యూలో ఉంటారు నిర్మాతలు. అది పవన్ కళ్యాణ్ రేంజ్. హీరోగా ఆయనకు తిరుగు లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆయన కేవలం హీరో మాత్రమే కాదు.. రాజకీయ నాయకుడు కూడా. అలాంటి వ్యక్తితో సినిమాలు చేయాలంటే నిర్మాతలకు కచ్చితంగా కాస్త రిస్క్ ఉంటుంది. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి ఎగబడిన టాలీవుడ్ ( Tollywood ) నిర్మాతలు.. ఇప్పుడు ఆయనతో సినిమా అనేసరికి కాస్త ఆలోచనలో పడుతున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వంతో పవన్ పెట్టుకుంటున్న వైరం ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలుసు.
ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ పై ఉన్న కోపంతో ఏపీలో సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారు అంటూ.. కొందరు విశ్లేషకులు ఇప్పటికే బాహాటంగా తమ అభిప్రాయం తెలిపారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ తో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్న నిర్మాతల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పవర్ స్టార్ నటించే ప్రతి సినిమా బడ్జెట్ 50 కోట్లకు పైగానే ఉంటుంది.. జరిగే బిజినెస్ 100 కోట్ల పై మాటే. ఇలాంటి సమయంలో రాజకీయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న రగడ ఆయన సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో నిర్మాతలకు అంతుచిక్కడం లేదు.
విడుదల సమయంలో వీటిపై ప్రభావం పడితే కచ్చితంగా అది కలెక్షన్స్ లో కనిపిస్తుంది. ఇప్పటికే వకీల్ సాబ్ విషయంలో ఇది రుజువైంది కూడా. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా నైజాంలో మంచి వసూళ్లు సాధించింది. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం వెనకబడింది. ఏపీలో ఈ సినిమాకు ఎన్ని కష్టాలు ఎదురయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఇప్పుడు పవర్ స్టార్ 4 సినిమాలు చేస్తున్నాడు వాటి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని నిర్మాతలు కంగారు పడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tollywood | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒంటరి అవుతున్నాడా..?
మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
Tollywood | పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

