Hit-2 Movie On OTT | అడివిశేష్‌కు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. ఆగస్టులో రిలీజైన ‘మేజర్’ పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే రిలీజైన ‘హిట్-2’తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించాడు. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిట్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేలోపే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. పోటీగా అవతార్ వంటి సినిమా ఉన్నా, థియేటర్లలో బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. అయితే మరో రెండు రోజుల్లో 5సినిమాలు రిలీజ్ కానున్నాయి. దాంతో ఈ సినిమాకు సంబంధించిన థియేటర్లు చాలా వరకు తగ్గనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. కాగా న్యూ ఇయర్ కానుకగా వచ్చే ఏడాది ఫస్ట్ వీక్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకనట రానుంది. ఇక అడివిశేష్ ఈ సినిమాతో వరుసగా ఆరు హిట్లు సాధించి డబుల్ హ్యట్రిక్ను సొంతం చేసుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో అడివిశేష్‌కు జోడీగా మీనాక్షీ చౌదరీ నటించింది. కోమలి ప్రసాద్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని నిర్మించాడు. ఇక మూడో పార్ట్‌లో నాని కథానాయకుడిగా నటించనున్నాడు.