యాంకర్ శ్రీముఖి హీరోయిన్గా సక్సెస్ అవుతుందా..?
యాంకర్స్ హీరోయిన్లుగా మారడం ఇప్పుడే కొత్తగా జరగడం లేదు. చాలా ఏళ్లుగా జరుగుతూనే ఉంది. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మరికొందరు కనీసం వచ్చినట్లు కూడా ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవడం లేదు.

యాంకర్స్ హీరోయిన్లుగా మారడం ఇప్పుడే కొత్తగా జరగడం లేదు. చాలా ఏళ్లుగా జరుగుతూనే ఉంది. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మరికొందరు కనీసం వచ్చినట్లు కూడా ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవడం లేదు. అందుకే తిరిగి బుల్లితెరపైకి వచ్చి తమ సత్తా చూపిస్తున్నారు. ఇప్పుడు శ్రీముఖి కూడా ఇదే చేస్తుంది. బుల్లితెరపై ఈమెకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. దీన్ని మెయింటైన్ చేస్తూనే వెండితెరపై కూడా అడుగు పెడుతుంది శ్రీముఖి. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. అయితే వెండితెరపై మాత్రం గుర్తింపు రాలేదు. దీంతో బుల్లితెరపై యాంకరింగ్‌కే సెటిల్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ 3లో 100 రోజుల పాటు రచ్చ చేసింది. చివరికి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వచ్చిన ఇమేజ్ బ్యాలెన్స్ చేసుకుంటుంది శ్రీముఖి. తన కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకుంటుంది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ వదిలేసుకుంది. చాలా సెలెక్టివ్‌గా షోలు కూడా చేస్తుంది. అన్నింటికంటే ముందు ఫోటోషూట్స్ విషయంలో రెచ్చిపోతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా అందాలను ఆరబోస్తుంది శ్రీముఖి. నిజానికి చాలా బిజీగా ఉన్న సమయంలోనే ఈమె బిగ్ బాస్‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎక్కువగా సినిమాలపై ఫోకస్ చేస్తుంది శ్రీముఖి. తాజాగా క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో రాజా రవీంద్ర, మనో లాంటి వాళ్లు నటిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తుంది శ్రీముఖి. అయితే అవేం క్రేజీ సినిమాలు కావు. అన్నింట్లోనూ శ్రీముఖి క్రేజ్ తప్ప మరోటి కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యాంకర్ శ్రీముఖి హీరోయిన్గా సక్సెస్ కావడం అంటే చిన్న విషయం కాదు. తనకు తలకు మించిన భారమే అని తెలిసినా కూడా ధైర్యంగా ముందడుగు వేస్తుంది. మరి ఈ ప్రయాణంలో సక్సెస్ దరి చేరుతుందో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బ్రహ్మాజీతో జాగ్రత్తగా ఉండు.. నాగశౌర్యకు రానా సూచన
యషికా ఆనంద్ ఆరోగ్యం అత్యంత విషమం..!
రెయిన్ సాంగ్స్ కు నో అంటున్న ఇస్మార్ట్ భామ
‘నారప్ప’ కొడుకు శీనప్ప రోల్ చేసింది ఎవరో తెలుసా…?
పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది.. చరణ్ ఇంటి ముందు పార్కింగ్..!
త్రిష పెళ్లి టాపిక్ మళ్లీ వైరల్..ఇంతకీ ఎవరా వ్యక్తి.?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

