ప్రఖ్యాత దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందనున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఇరువురి భామల కౌగిలిలో’. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో సినీప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది. త్రినాథ్‌వర్మ, వైష్ణవి కొల్లూరు, మలినా ప్రధాన పాత్రధారులుగా నటించనున్న ఈ చిత్రానికి అచ్యుత్ చౌదరి దర్శకుడు. శ్రీనివాసగౌడ్ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి నిహారిక కొణిదెల క్లాప్ ఇవ్వగా, ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ కెమెరా స్విచాన్ చేశారు.
మరో ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి, కెమెరామెన్ ఎస్.గోపాల్‌రెడ్డి కలిసి ఫస్ట్‌షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. నటీనటులు, దర్శక, నిర్మాతలకు కె.రాఘవేంద్రరావు స్క్రిప్ట్‌ని అందించారు. ఇంకా దర్శకులు యదువంశీ, మల్లిక్‌రామ్, వర ముళ్లపూడి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతిథులంతా చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, కెమెరా: శశాంక్ శ్రీరామ్, సంగీతం: శ్రీను భీట్స్.