Irumudi | మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా ఘనవిజయం సాధించడంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక సినిమా విజయం సాధిస్తే అది ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ పండుగ లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.
‘ఇరుముడి’ సినిమా ఆసాంతం ఎంతగానో ఆకట్టుకుందని చిరంజీవి తెలిపారు. ముఖ్యంగా త్రినాథ్ పాత్రను తన భుజాన వేసుకుని రవితేజ అద్భుతమైన నటన కనబరిచారని కొనియాడారు. దర్శకుడు శివ నిర్వాణ సినిమాను ఎంతో లోతుగా, భావోద్వేగాలతో తెరకెక్కించి అద్భుతమైన ప్రతిభ చూపించారని ప్రశంసించారు. ఈ చిత్రంలో నటించిన చిన్నారి బేబీ నక్షత్ర భవిష్యత్తులో మరింత ఉజ్వలమైన విజయాలు అందుకోవాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ తో పాటు చిత్రంలో నటించిన సాయికుమార్, ప్రియా భవానీ శంకర్, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ సహా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ చిరంజీవి తన అభినందనలు తెలిపారు. ఈ పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి! అంటూ ‘లైవ్ అండ్ లెట్ లీవ్’ అనే నినాదాన్ని ఆయన మరోసారి గుర్తుచేశారు.