Irumudi | ఇరుముడి సినిమాని సొంత ఊరిలో చూసిన టాలీవుడ్ విలన్.. సామాన్య ప్రేక్షకుడిలా లైన్లో నిలుచొని..
Irumudi | ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఇరుముడి’ మేనియా కొనసాగుతోంది. మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి జోరుతో దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, భావోద్వేగభరితమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మౌత్ టాక్ కూడా బాగా కలిసొస్తోంది.
Irumudi | ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఇరుముడి’ మేనియా కొనసాగుతోంది. మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి జోరుతో దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, భావోద్వేగభరితమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మౌత్ టాక్ కూడా బాగా కలిసొస్తోంది. రవితేజ సరసన ప్రియ భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా, కేరళకు చెందిన బాలనటి బేబీ నక్షత్ర ‘మనమ్మ’ పాత్రలో తన సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ముఖ్యంగా తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్‌ను దర్శకుడు హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.విడుదలైన ఐదు రోజుల్లోనే ‘ఇరుముడి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ప్రచారం జరుగుతోంది.
భారీ సినిమాల పోటీ మధ్య కూడా ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటుడు అజయ్ ఘోష్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నారని ప్రశంసలు అందుతున్నాయి. కథలో కీలకమైన పాత్రలో కనిపించిన ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.‘ఇరుముడి’ విజయాన్ని అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేస్తుండగా, తాజాగా అజయ్ ఘోష్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన సొంత ఊరైన వేటపాలెంలోని ఓ థియేటర్‌కు వెళ్లిన ఆయన, ఎలాంటి హంగామా లేకుండా సాధారణ ప్రేక్షకుడిలా టికెట్ తీసుకుని ‘ఇరుముడి’ చిత్రాన్ని వీక్షించారు.
సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడే ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూడటం అక్కడున్న వారికి ఆసక్తికర అనుభవంగా మారింది. ఈ సందర్భంగా థియేటర్లో ప్రేక్షకుల స్పందనను అజయ్ ఘోష్ స్వయంగా గమనించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
తన సొంత ఊరు వేటపాలం థియేటర్లో లైన్లో నిల్చొని టికెట్ తీసుకుని #Irumudi సినిమా చూసిన నటుడు Ajay Ghosh. ❤️ pic.twitter.com/LeqCajihvC
— cinee worldd (@Cinee_Worldd) August 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

