శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 26, 2020 , 08:17:47

ఇర్ఫాన్ త‌ల్లి మృతి.. విషాదంలో కుటుంబ స‌భ్యులు

ఇర్ఫాన్ త‌ల్లి మృతి.. విషాదంలో కుటుంబ స‌భ్యులు

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న త‌ల్లి స‌యీదా బేగం అనారోగ్యం కార‌ణంతో శనివారం( ఏప్రిల్ 25) తుది శ్వాస  విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమెకి శ‌నివారం ఒక్క‌సారిగా ఆరోగ్యం క్షీణించింది. ఈ  నేప‌థ్యంలో క‌న్నుమూశారని ఇర్ఫాన్ సోద‌రుడు  చెప్పారు.

అయితే ప్ర‌స్తుతం ముంబైలో ఉన్న ఇర్ఫాన్ ఖాన్ త‌న త‌ల్లి చివ‌రి చూపుల‌కి కూడా నోచుకోలేక‌పోయాడ‌ని తెలుస్తుంది. లాక్‌డౌన్ వ‌ల‌న ఆయ‌న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన తల్లికి నివాళులు అర్పించారు. కాగా  సయీదాకు ముగ్గురు కుమారులు.. వారు.. ఇర్ఫాన్ , అతని సోదరులు సల్మాన్ , ఇమ్రాన్ లు. ఇదిలా ఉంటే  ఇర్ఫాన్ గ‌త ఏడాది అనారోగ్యంకి గురైన సంగ‌తి తెలిసిందే . మొన్నటి వరకు అరుదైన వ్యాధితో పోరాడిన ఆయ‌న విదేశాల‌లో చికిత్స తీసుకొని ఈ మధ్యే ఇండియాకు వచ్చాడుlogo