దుల్కర్ సల్మాన్, మృణాళికి ఠాకూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘సీతా రామం’. స్వప్న సినిమా పతాకంపై దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో భావోద్వేగాలు నిండిన ప్రేమ కథను ఈ సినిమాలో చూపించబోతున్నారు.
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ పోషించిన బాలాజీ పాత్రను రివీల్ చేశారు. ‘బాలాజీ ఉన్నాడు కదా అంతా అతను చూసుకుంటాడు..’ అనే డైలాగ్‌ను ఈ పాత్రతో చెప్పించారు. బాలాజీ క్యారెక్టర్ ఎలా ఉండనుందో అనే ఆసక్తిని ఈ డైలాగ్ క్రియేట్ చేసింది. గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, శత్రు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్.