Kantara Chapter 1 | కన్నడ నటుడు రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాంతార చాప్టర్ -1. 2022లో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ సినిమా వస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 02న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ సినిమాలో నటిస్తున్న కథానాయక రుక్మిణి వసంత్‌ని పరిచయం చేశారు మేకర్స్. రుక్మిణి వసంత్ ఇందులో కనకవతిగా కనిపించబోతున్నట్లు ప్రకటించారు. హొంబాలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అజ్నిశ్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయనున్నారు.
Introducing @rukminitweets as ‘KANAKAVATHI’ from the world of #KantaraChapter1
ಕನಕವತಿಯ ಪರಿಚಯ ನಿಮ್ಮ ಮುಂದೆ
कनकवती का परिचय आपके लिए
కనకవతి ని మీకు పరిచయం చేస్తున్నాంIn Cinemas #KantaraChapter1onOct2 🔥 pic.twitter.com/mZNyuHEAn9
— rukmini (@rukminitweets) August 8, 2025