చిరంజీవి లూసీఫర్ రీమేక్ కు అదిరిపోయే టైటిల్
కింగ్ మేకర్ | ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ కు రారాజు సహా పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఏవీ కన్ఫర్మ్ అవ్వలేదు.

చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య పూర్తి కాక ముందే మరో రెండు సినిమాలు కూడా కన్ఫర్మ్ చేశాడు. అందులో లూసీఫర్ రీమేక్ ముహూర్తం కూడా పెట్టేశాడు. ఈ చిత్రాన్ని మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగులో కూడా విడుదలైంది. అయినా కూడా కథ నచ్చి ఇక్కడ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు చిరంజీవి. ఈ చిత్రం కోసం సీనియర్ రైటర్ సత్యానంద్ తో పాటు లక్ష్మీ భూపాల కూడా పని చేస్తున్నారు. ఆయనతో పాటు చిరుకు సన్నిహితులైన మరో ఇద్దరు ముగ్గురు రైటర్స్ టీం కూడా ఉన్నారు. నిజానికి ఏప్రిల్‌లోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ కన్ఫర్మ్ అయిందని ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ కు రారాజు సహా పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఏవీ కన్ఫర్మ్ అవ్వలేదు. ఈ క్రమంలో ఈ సినిమాకు తాజాగా మరో టైటిల్ కూడా వినిపిస్తోంది. ఈ రీమేక్ కు కింగ్ మేకర్ టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కు సరిపోయే టైటిల్ కావడంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. కాగా, లూసీఫర్ రీమేక్ తో పాటు మరో రీమేక్ సినిమాకు కూడా ఓకే చెప్పాడు మెగాస్టార్. అదే వేదాళం రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని కన్ఫర్మ్ కూడా చేశాడు చిరు.

మెహర్ గత సినిమా షాడో వచ్చి ఏడేళ్లు అయిపోయింది. ఆ సినిమాను తెరకెక్కించిన తర్వాత మెహర్ రమేష్ పూర్తిగా ఖాళీ అయిపోయాడు. ఆయనతో సినిమా అనే ఆలోచనలను షాడో చూసిన తర్వాత పూర్తిగా తుడిచేశారు హీరోలు. నిర్మాతలు అయితే మెహర్ వైపు వెళ్లడం కూడా మానేశారు. మధ్యలో రవితేజతో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి.. కానీ ఈయన రిస్క్ తీసుకోలేకపోయాడు. ఇక పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తాడన్నారు కానీ కుదర్లేదు. అయితే ఏడేళ్లు గ్యాప్ ఇచ్చినా కూడా ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు రమేష్. తమిళనాట సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేసే బాధ్యతను మెహర్ రమేష్‌కు అప్పగించాడు చిరు. ఈ చిత్ర షూటింగ్ లూసిఫర్ రీమేక్ తర్వాత మొదలు కానుంది.

ఇప్పుడున్న వయసు ప్రకారం డాన్సులతో పాటు ఫైట్ సీక్వెన్సులు కూడా అంతగా చేయలేనని చిరు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే లూసీఫర్ లాంటి స్టోరీ డ్రివెన్ సినిమాల వైపు చిరు మనసు మళ్లుతుంది. 65 ఏళ్ల మెగాస్టార్ ఇప్పుడు అలాంటి యాక్షన్ సీక్వెన్సులు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే లూసిఫర్ రీమేక్ లో అలాంటివి ఏమి లేకుండా చూసుకుంటున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
టాలీవుడ్‌కు కష్టమే : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ ?
హోంక్వారంటైన్లో ‘వకీల్‌సాబ్’
ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్.. రిలీజ్ ఆపేయాలని ఫిర్యాదు
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోలేదట!
అండర్ వాటర్‌లో మెహరీన్‌కు ప్రపోజ్- వీడియో వైరల్
బీచ్‌లో దిశా పటాని బికినీ షో.. వైరల్‌గా మారిన ఫొటో
బాక్సాఫీస్‌కు కరోనా దెబ్బ.. మూడు నెలల్లో 50 కోట్లే!
పవర్ స్టార్ ఊచకోత.. తొలి రోజు భారీ కలెక్షన్స్
‘వకీల్ సాబ్’ సినిమాపై పూనమ్ కౌర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..
ఇదెక్కడి పిచ్చి అభిమానం.. పవన్ ఫ్యాన్ పై అనసూయ ఆగ్రహం
మరోసారి కెమెరాకు చిక్కిన ప్రేమ పక్షులు.. వైరల్‌గా మారిన ఫొటోలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

