తమిళ స్టార్ హీరో విక్రమ్ (Vikram), డైరెక్టర్ పా రంజిత్ (Pa Ranjit)తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 2021 డిసెంబర్లో ఈ ప్రాజెక్టును ప్రకటించారు. తాజాగా ఈ సినిమా మరోసారి హెడ్‌లైన్స్ లో నిలిచింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుందట. అంతేకాదు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుండగా..3డీ వెర్షన్లో షూట్ చేయబోతున్నారని టాక్. ఈ ప్రాజెక్టు ప్రిన్సిపల్ ఫొటోగ్రఫీ ఈ ఏడాది జులై 15 నుంచి షురూ కానుంది.చియాన్ 61వ (Chiyaan61) ప్రాజెక్టుగా వస్తున్న ఈచిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
విక్రమ్‌ను పా రంజిత్ ఎలా చూపించబోతున్నాడోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈచిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్..కాగా మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. విక్రమ్ ఇప్పటికే తమిళంలో మహాన్, మల్టీస్టారర్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్, కోబ్రా సినిమాల్లో నటిస్తుండగా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.