టాలీవుడ్ యువ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ విరూపాక్ష (Virupaksha). SDT15వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే నెట్టింట సందడి చేస్తోంది. విరూపాక్ష ప్రపంచంలోకి.. అంటూ కథలో భాగంగా వచ్చే అఘోరా గుహల మేకింగ్ విజువల్స్ వీడియోను షేర్ చేశారు మేకర్స్. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
అఘోరా గుహల్లోకి వచ్చే సన్నివేశాలు సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయని తాజా వీడియోతో చెబుతున్నారు మేకర్స్.
ఈ చిత్రం నుంచి విడుదలైన నచ్చావులే నచ్చావులే లిరికల్ వీడియో సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ మెస్మరైజ్ చేస్తోంది.
ఇప్పటికే విడుదలైన విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో భీమ్లానాయక్ ఫేం, మలయాళ భామ సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
చరిత్రలో ఇలాంటి సంఘటన జరుగడం ఇదే మొదటిసారి.. అంటూ తన ఊరిలో జరిగిన సంఘటన గురించి సాయిచంద్ చెబుతున్న డైలాగ్స్ తో సాగుతున్న టీజర్.. ఇంతకీ ఊరి జనాలకు ఎలాంటి సమస్య వచ్చింది. దాన్ని సాయిధరమ్ ఎలా పరిష్కరించాడనేది సస్పెన్స్ లో పెడుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కాంతార ఫేం అంజనీశ్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ విరూపాక్షలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విరూపాక్ష ప్రపంచంలోకి..
విరూపాక్ష టీజర్..
విరూపాక్ష తెలుగు టైటిల్ గ్లింప్స్ వీడియో..
రిస్కీ బైక్ స్టంట్ గ్లింప్స్ వీడియో..
Read Also :
Star Heroines | రాజ శ్యామల యాగం బాటలో స్టార్ హీరోయిన్లు.. సీక్రెట్ ఏంటో..?
Ooru Peru Bhairavakona | సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన నుంచి నిజమే నే చెబుతున్నా లిరికల్ సాంగ్
Shaakuntalam | బ్యూటీఫుల్‌గా శాకుంతలం మల్లిక మల్లిక వీడియో సాంగ్