టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం శాకుంతలం (Shaakuntalam). పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణశేఖర్ (Guna Sekhar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన మల్లిక మల్లిక సాంగ్ ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. తాజాగా మల్లిక మల్లిక వీడియో సాంగ్ (Mallika Mallika video Song)ను లాంఛ్ చేశారు మేకర్స్. ఒక నిమిషం 12 సెకన్లపాటు ఉన్న తాజా మెలోడి ట్రాక్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటూ సాగుతోంది.
చైతన్య ప్రసాద్ రాసిన ఈ పాటను రమ్య బెహరా పాడింది. గుణశేఖర్ ఎంత అందంగా ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నాడో ఈ ఒక్క పాటతో తెలిసిపోతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ కంపోజిషన్‌లో ఇప్పటికే విడుదలైన ఏలేలో ఏలేలో, రుషివనంలోన పాటలు నెట్టింట సందడి చేస్తున్నాయి. శాకుంతలంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు.
పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, అదితీ మోహన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. శాకుంతలం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
మల్లిక మల్లిక వీడియో సాంగ్..
మల్లిక మల్లిక లిరికల్ సాంగ్..
శాకుంతలం ట్రైలర్..
ఏలేలో ఏలేలో లిరికల్ వీడియో సాంగ్..
రుషివనంలోన లిరికల్ వీడియో..