Salaar | ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్-1’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. గత నెలలో విడుదలైన టీజర్ భారీ యాక్షన్ ఘట్టాలు, పవర్ఫుల్ ఎలివేషన్స్‌తో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూన్ బయటికొచ్చింది. అంతర్జాతీయ మాఫియా నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను దృష్టిలో పెట్టుకొని రొమాంచితమైన యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేశారని తెలిసింది.
ఈ సినిమాలో ప్రధాన విలన్‌గా ఓ ఇంటర్నేషనల్ స్టార్ నటించారని, ఆయన పాత్రను ట్రైలర్లో రివీల్ చేయబోతున్నారని సమాచారం. అంతర్జాతీయ క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ప్రేక్షకుల అంచనాలకు మించి ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, ఈశ్వరీరావు, జగపతిబాబు, శ్రియా రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు.