మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి ఇండియన్ 2 (Indian 2). కమల్ హాసన్ (kamal haasan), శంకర్ (Shankar) కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంకా 60-70 రోజులు షూటింగ్ పూర్తయితే ఇండియన్ 2 చిత్రీకరణ మొత్తం అయిపోయినట్టేనట.
అయితే ప్రస్తుతం శంకర్ టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్‌తో చేస్తున్న ఆర్సీ 15 విదేశీ షెడ్యూల్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మరి ఇండియన్ 2 షూటింగ్‌ను శంకర్ ఎప్పుడు పూర్తి చేస్తాడన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో శంకర్ ఓ వైపు ఇండియన్ 2ను మరోవైపు ఆర్సీ 15 సినిమాలను ఎలా బ్యాలెన్స్ చేస్తాడోనని తెగ ఆలోచిస్తున్నారు సినీ జనాలు. ఇండియన్ 2 వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఇండియన్ 2 పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
Read Also : Nidhhi Agerwal | ఇస్మార్ట్ బ్యూటీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న పాట ఇదేనట
Read Also : 80s actors | చిరంజీవి, రమ్యకృష్ణ, అర్జున్ డ్యాన్స్.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Read Also : Gopichand30 | కోల్‌కతాలో సూపర్‌స్టార్ కృష్ణకు గోపీచంద్ 30 టీం నివాళి