RAPO 23 | ఇప్పటిదాకా హీరోగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని ఇక డైరెక్టర్‌గా తన లక్‌ను పరీక్షించుకోబోతున్నాడని తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్నఈ మూవీ RAPO23 వర్కింగ్ టైటిల్‌తో రాబోతుంది. పాపులర్ కంపోజర్ శ్యామ్ సీఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేయబోతున్నాడని ఇప్పటికే ఓ వార్త తెరపైకి వచ్చిందని తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.
కాగా ఇప్పుడు మరో ఆసక్తికర అప్డేట్ నెట్టింట రౌండప్ చేస్తోంది. ఇంతకీ అదేంటనే కదా మీ డౌటు. ఇంతకీ రామ్ ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తాడని అంతా అనుకుంటుండగా.. ఈ చిత్రానికి Eka – The Lone Wolf అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. ఒకవేళ ఇదేనిజమైతే ఈ టైటిల్ రామ్ మ్యానరిజానికి పక్కాగా సూటవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టైటిల్‌పై రామ్ టీం ఏదైనా అధికారిక ప్రకటన ఇస్తుందేమో చూడాలి మరి.
ఈ చిత్రాన్ని RaPo సినిమాటిక్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు తిరు సినిమాటోగ్రఫర్ కాగా.. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా కనిపించిన రామ్ ఇక డైరెక్టర్ కమ్ యాక్టర్‌గా తెరకెక్కిస్తున్న తాజా సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
Vemulawada | రంగు నీళ్లతో వీధి కుక్కలకు చెక్..! వేములవాడలో పట్టణ ప్రజల వింత ప్రయోగం
‘విద్యారంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం’
Jobs | నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్లో 376 ఖాళీలు