Sonakshi Sinha | సోనాక్షి సిన్హా , జహీర్ ఇక్బాల్‌ల పెళ్లి అంటూ అంటూ గతంలో వార్తలు వినిపించాయి. ఇప్పుడు నిజంగానే ఈ జంట ఒకటైపోతున్నారు. ఈ ఆదివారమే వీరి వివాహం జరుగనున్నదని తెలుస్తున్నది. ఇందులో బాగంగా వీరి ఇంట నిర్వహించిన మెహందీ వేడుక ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో ఇరు కుటుంబాలకు చెందిన కొద్దిమంది అతిథులు మాత్రమే ఉన్నట్టు తెలుస్తున్నది. సోనాక్షి, ఇక్బాల్ కలిసి ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే.
ఆ సినిమా సమయంలో ఇద్దరిమధ్య ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారింది. కొన్ని రోజుల క్రితం సోనాక్షి పెళ్లి టాపిక్‌ని ఆమె తండ్రి శత్రుఘ్నసిన్హా ముందు ప్రస్తావిస్తే.. ‘వారి ప్రేమ, పెళ్లి గురించి నాకేమీ తెలీదు..’ అని నిర్మొహమాటంగా సమాధానమిచ్చారు. తాజాగా ఆ ప్రస్తావనే మరోసారి ఆయన ముందు తీసుకొస్తే.. ‘ఇది నా కుమార్తె జీవితం. పెళ్లి ఆమె వ్యక్తిగతం. తండ్రిగా ఆమె పెళ్లికి వెళ్లాల్సిన బాధ్యత నాకుంది… తప్పకుండా వెళ్తా. నేనే తన బలం అని చాలా సందర్భాల్లో చెప్పింది తను. ఆమె అంటే నాకూ అమితమైన ప్రేమ. వెళ్లకుండా ఎలా ఉంటాను? అని సమాధానమిచ్చారు శతృఘ్నసిన్హా.