సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అగ్ర నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై పలువురు సినీ తారలు విచారం వ్యక్తం చేశారు. ఆ సంఘటనకు ఏ ఒక్క వ్యక్తినో బాధ్యున్ని చేయడం సరికాదని అన్నారు. అల్లు అర్జున్‌కు మద్దతుగా సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌లు పెట్టారు. ‘వి స్టాండ్ విత్ అల్లు అర్జున్’ హ్యాష్‌ట్యాగ్ ఎక్స్‌లో ట్రెండ్ అయింది. అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో హాట్‌టాపిక్‌గా మారింది. ‘పుష్ప-2’ పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న తరుణంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం ఆయన అభిమానులను కలవరపరచింది.
అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం. ఇలా చేయడం కరెక్ట్ కాదు. తెలుగు చిత్రపరిశ్రమ అతనికి అండగా ఉంటుంది. మేం అందరం అతనితో ఉన్నాం.
సంధ్య థియేటర్ వద్ద జరిగింది దురదృష్టమైన హృదయ విదారక సంఘటన. దాని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. మరిన్ని జాగ్రత్తలు పాటించి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో మనందరి తప్పు ఉంది. ఒక్కరినే నిందించడం, ఒక్కరినే బాధ్యుడ్ని చేయడం సబబు కాదు. సినిమావాళ్ల విషయంలో ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే చొరవ సాధారణ పౌరులపై కూడా చూపించాలని కోరుకుంటున్నా.
ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోతున్నా. థియేటర్ వద్ద జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అయితే దానికి ఒక్క వ్యక్తిని బాధ్యున్ని చేసి ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సబబుగా లేదు. ఈ పరిణామాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి.
సంధ్య థియేటర్ సంఘటన బాధాకరమైనది, హృదయ విదారకమైనది. మెరుగైన భద్రత లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆ సంఘటన చెబుతున్నది. ఈ దురదృష్ట సంఘటనకు అల్లు అర్జున్‌గారిని బాధ్యుడ్ని చేయడం ఏమాత్రం సమంజసం కాదు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో ఆయన బాధ్యతగా వ్యవహరించారు. దీనికి అందరం ఆయన్ని ప్రశంసించాలి. నిందలతో నిజాన్ని కప్పివేయలేం. బాధిత కుటుంబానికి న్యాయం జరగనివ్వండి. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సమాజంలో అందరిదీ.
ఇలాంటి సందర్భాల్లో భద్రతాపరమైన అంశాలను నటీనటులు ఒక్కరే చూసుకోలేరు. జాగ్రత్తగా ఉండాలని తమ పక్కనున్న వారికి చెబుతుంటారు. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనల విషయంలో ఒక్క వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం.
ఏవైనా విషాదకరమైన సంఘటనలు జరిగినప్పుడు భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని ఒక్క వ్యక్తికి తప్పుని ఆపాదించడం భావ్యం కాదు. అందరూ సమిష్టి బాధ్యత తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.
1. పుష్కరాలు, బ్రహ్మోత్సవాల టైమ్‌లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా?
2. ఎన్నికల ప్రచారాల్లో జరిగిన తొక్కిసలాటల్లో ఎవరైనా పోతే నాయకుల్ని అరెస్ట్ చేస్తారా?
3. లక్షలాది అభిమానుల సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్స్ జరిగినప్పుడు అభిమానుల్లో ఎవరైనా పోతే హీరోహీరోయిన్లని అరెస్ట్ చేస్తారా?
4. భద్రతా ఏర్పాట్లను పోలీసులే చూసుకోవాలి. ఫిల్మ్ హీరోలు, నాయకులు వాటిని ఎలా మేనేజ్ చేయగలరు? జనాన్ని ఎలా కంట్రోల్ చేయగలరు?