బాలీవుడ్ నటి, మోడల్ ఎవెలిన్ శర్మ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. తన కూతురు అవా భిండీకి బ్రెస్ట్‌ఫీడ్ చేస్తున్న ఫోటో అది. ఆ ఫోటోను ఎవెలిన్ ఇటీవల తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేయగా.. ఆ ఫోటోపై నెటిజన్లు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. 5 రోజుల క్రితం ఆ ఫోటోను శర్మ షేర్ చేసింది. పాలు ఇవ్వాలనుకుంటే ప్రైవేట్‌గా ఇవ్వు. ఇలా పాలు ఇస్తూ ఫోటోను షేర్ చేయడం ఏంటి. అది అందరికీ చూపించేదా.. అంటూ నెటిజన్లు ట్రోల్ చేయడంతో ఎవెలిన్ శర్మ ఆ ఫోటోపై రెస్పాండ్ కాక తప్పలేదు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఫోటోపై స్పందించిన శర్మ.. తల్లిగా తన ప్రయాణం గురించి తన ఫ్యాన్స్, ఫ్రెండ్స్‌కు షేర్ చేయాలనుకున్నానని చెప్పుకొచ్చింది.
అది నాకు నచ్చింది. షేర్ చేయాలనుకున్నాను. బ్రెస్ట్‌ఫీడింగ్ అనేది తప్పు కాదు కదా. అది సహజం. అమ్మతనం. అందరూ చేసేదే. దాంట్లో సిగ్గు పడటానికి ఏముంది. ఇటువంటి ఫోటోలు బలాన్ని ఇస్తాయి. ఒక్కోసారి అవే దుర్బలంగా అనిపించవచ్చు. బ్రెస్ట్‌ఫీడింగ్ అంటే అందరూ అనుకున్నంత ఈజీగా కాదు. తల్లిగా జర్నీ స్టార్ట్ అయ్యాక.. ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవన్నీ అందరు తల్లులకు తెలియాలనే నేను ఆ ఫోటోను షేర్ చేశా.. అని ఎవెలిన్ శర్మ చెప్పుకొచ్చింది.