IND vs PAK Match | ఆసియా కప్ 2025లో భాగంగా నేడు భారత్-పాకిస్థాన్‌ల మధ్య టీ20 మ్యాచ్ జరుగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌పై భారతీయులు ఎవరు ఆసక్తిగా లేనట్లు తెలుస్తుంది. ఒకప్పుడు పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్ అనగానే టీవీ ముందు అతుక్కుపోయే భారతీయులు ఇప్పుడు దాయాదితో పోరు అనేవరకు ఆసక్తికూడా చూపట్లేదు.
దీనికి ముఖ్య కారణం.. కొన్ని నెలల ముందు కాశ్మీర్లో జరిగిన పహెల్గాం ఉగ్రదాడి ఘటనే. పహెల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం పాకిస్థాన్‌తో ఇండియా దౌత్య సంబంధాలను చాలావరకు తెంచుకుంది ఇండియా. అయితే పహెల్గాం దాడి ఘటన దేశ ప్రజలు మరవకముందే పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్ ఆడుతుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడడం అనేది దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని అంటూ సోషల్ మీడియాలో బీసీసీఐని అలాగే కేంద్రప్రభుత్వంని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
పహెల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు సైతం ఈ మ్యాచ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాద దేశానికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చే ఇలాంటి మ్యాచ్‌లు ఆడడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ మ్యాచ్‌పై #BoycottIndvsPakMatch అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. క్రికెట్ అభిమానుల్లో సాధారణంగా కనిపించే ఉత్సాహం ఈ మ్యాచ్‌పై కనిపించట్లేదు. చాలా మంది భారతీయులు ఈ మ్యాచ్‌ను చూడకూడదని నిర్ణయించుకున్నారు. మరోవైపు, భారత క్రికెటర్లు ఈ అంశంపై మౌనంగా ఉండడాన్ని కూడా కొందరు నెటిజన్లు విమర్శించారు.
#shameonyoubcci #INDvsPAKMatch #BycottAsiaCup #bccideshdrohi pic.twitter.com/EuJwLIAKRC
— Majlis Ka Deewana (@MajlisKaDeewana) September 13, 2025
Seriously India will play against Pak. Tomorrow.#indvspak2025 #INDvsPAKMatch pic.twitter.com/8UqCP6m2xU
— Abhinav prakash (AP12) (@imabhi0012) September 13, 2025
BCCI to Indian’s & Army #INDvsPAKMatch #BCCI pic.twitter.com/qaS1WRYp8h
— Lakhan Sharma (@Lakhan_Sharma__) September 14, 2025