డిసెంబర్లో స్పోర్ట్స్ సినిమాలు జాతర.. ఒకదాన్ని మించి మరోటి వస్తున్నాయిగా..

sports movies | చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర సందడి కనిపిస్తుంది. బాలయ్య అఖండ సినిమా విడుదలైన విధానం దానికి వస్తున్న రెస్పాన్స్ చూసి తర్వాత నిర్మాతలలో నమ్మకం కుదిరింది. ఇక మీద పెద్ద సినిమాలు విడుదల చేయొచ్చు అని వాళ్లు గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ చాలా సినిమాలకు వేదిక కానుంది. అఖండతో సినిమా జాతర మొదలైంది. ఇక ఆ తర్వాత ప్రతి వారం సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే డిసెంబర్ నెల క్రీడా ప్రధానమైన సినిమాలకు కేంద్ర బిందువుగా మారింది. ఒకటో రెండో కాదు చాలా సినిమాలు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్నాయి. అందులో తెలుగుతో పాటు హిందీ సినిమాలు కూడా ఉండటం గమనార్హం.
డిసెంబర్ 10న విడుదలైన రెండు సినిమాలు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లోనే ఉన్నాయి. కీర్తి సురేశ్ హీరోయిన్గా నగేష్ కుకునూర్ తెరకెక్కిస్తున్న సినిమా గుడ్ లక్ సఖి ( Good Luck Sakhi ). ఇందులో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 10న ఈ సినిమా విడుదల కానుంది. గన్ షాట్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. ఇక అదే రోజు సంతోశ్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న లక్ష్య ( Lakshya ) సినిమా విడుదల కానుంది. ఇందులో నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడు. ఇది ఆర్చరీ నేపథ్యంలో వస్తుంది. అంటే విలువిద్య అన్నమాట. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లక్ష్య సినిమా కోసం చాలా కష్టపడ్డాడు నాగశౌర్య.
డిసెంబర్ 24న రాబోయే అతిపెద్ద స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా 83. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో చిరస్థాయిగా మిగిలిపోయిన 1983లో వరల్డ్ కప్ జర్నీని సినిమాగా చేశాడు కబీర్ ఖాన్. రణవీర్ సింగ్ ఈ సినిమాలో హీరో. ఆయన కపిల్ దేవ్ పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేరోజు విడుదల కానుంది.
డిసెంబర్ 31న రాబోతున్న మరో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా జెర్సీ ( Jersey ). షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు జెర్సీకి రీమేక్. ఒరిజినల్‌ను తెరక్కెకించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్‌కు కూడా దర్శకత్వం వహించాడు. మొత్తానికి డిసెంబర్లో నాలుగు స్పోర్ట్స్ సినిమాలు వస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tollywood | కొంతమంది హీరోలకు సొంత పేర్లు అసలు కలిసి రావు.. ఇదుగో సాక్ష్యం
Chiranjeevi Acharya | ఆచార్య సినిమా షూటింగ్ ఇంకా అయిపోలేదా..?
సిరివెన్నెల అంత్యక్రియలకు హాజరు కాని మంచు ఫ్యామిలీ.. కారణం చెప్పిన మోహన్ బాబు
Akhanda:ఓవర్సీస్‌లోను అఖండ ఊచకోత.. కలెక్షన్ల ప్రవాహం ఆగడం లేదుగా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- 83
- good luck sakhi
- Jersey
- Lakshya
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

