Akhanda:ఓవర్సీస్‌లోను అఖండ ఊచకోత.. కలెక్షన్ల ప్రవాహం ఆగడం లేదుగా..!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. రెండవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటింది. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలయ్య తన కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. రెండు వేరియేషన్ లో కూడా బాలయ్య లోని మాస్ విశ్వరూపం చూపించడంతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా ఈ సినిమా వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.
ట్రేడ్ లెక్కల ప్రకారం అమెరికాలో ఈ చిత్రం హాఫ్ మిలియన్ (550K+) డాలర్స్ మార్క్‌ని సంపాదించుకుంది. అయితే 2021లో ఒక తెలుగు సినిమాకి ఈ తరహా కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి కావటం విశేషం. ఇదే జోరు కొనసాగితే ఈ వీకెండ్ లోపలే వన్ మిలియన్ మార్క్ చేరుకోవడం గ్యారంటీ. ఈ సినిమా కేవలం ప్రీమియర్ షోల ద్వారానే భారీ వసూళ్లు రాబట్టింది. ఇంతటి స్థాయిలో ఈ ఏడాదిలో ఏ సినిమా వసూళ్లను సాధించలేదు.
అఖండ సినిమా నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదల అయ్యింది. ఇక బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వాలి అంటే మొత్తంగా 60కోట్లకు పైగా వసూళ్లను అందుకోవాల్సి ఉంటుంది. మొదటి రోజు వచ్చిన షేర్ ను బట్టి చూస్తే ఈ సినిమా ఈ వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. విలన్ పాత్రలో శ్రీకాంత్ అదరగొట్టాడు. ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించగా. థమన్ సంగీతం అందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- akhanda
- bala krishna
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

