The Birthday Boy | రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది బర్త్‌డే బాయ్’ (The Birthday Boy). విస్కి దర్శకత్వం వహించిన ఈ మూవీని బొమ్మ బొరుసా బ్యానర్‌పై నిర్మించగా.. ఐ భరత్ ఎక్స్క్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. జులై 19న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ రెస్సాన్స్ రాబట్టుకుంది.
ఎం.ఎస్ చదవడానికి విదేశాలకు వెళ్లిన ఐదుగురు చిన్ననాటి స్నేహితులకు అక్కడ జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.. ఒక బర్త్ డే పార్టీలో తన స్నేహితుడికి బర్త్ డే బంప్స్ (పుట్టినరోజు నాడు చేసే సరదా పని) ఇద్దామని ప్లాన్ చేసిన స్నేహితులు అనుకోకుండా అతడి చావుకి కారణం అవుతారు. అయితే ఈ క్రమంలో అక్కడ జరిగిన సంఘటనలతో సాగే ఈ చిత్రం ఆగస్టు 9న ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
యూత్‌ఫుల్ క్రేజీ డ్రామా నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రస్తుతం పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఓటీటీ లవర్స్ ఇంప్రెస్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. అన్ని రకాల ఎలిమెంట్స్‌తో సాగే కథలోని ఎమోషన్స్‌కు ఓటీటీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకేంటి మరి థియేటర్లలో సినిమాను మిస్సయితే ఆహాలో మీరూ ఓసారి లుక్కేయండి.
A Birthday Bash Filled with..🎂
Fear, Horror, and Tension!😯
Watch #Thebirthdayboy on aha!! 👉 ▶️https://t.co/4T8uHAu3Wl@actorsameersamo @rajeevco @pramodini15 @MAniGoudMG @vikranthved @Rchilam @RajaAsok999 @ShravanthiAnand @A_WHISKY_MAN @bharatgump @DopRahul @nareshadupa pic.twitter.com/v9P040z1t3— ahavideoin (@ahavideoIN) August 9, 2024
Chiranjeevi | కల్కి 2898 ఏడీ మేకర్స్ తీరుతో చిరంజీవి అభిమానులు అప్సెట్.. కారణమిదేనట..!
They Call Him OG | పవన్ కల్యాణ్ బ్యాక్ టు సెట్స్.. ఓజీ షూట్ డేట్ ఫిక్సయినట్టే..?
Matka | వరుణ్ తేజ్ మట్కా కింగ్ వాసు లుక్ అదిరింది.. !