Iman Ismail | సీతారామం మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ హను రాఘవపుడి. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఇద్దరి కాంబోలో ఈ మూవీ రాబోతున్నది. ఇక మూవీ షూటింగ్‌ను శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సినిమా పీరియాడికల్ యాక్షన్ లవ్ స్టోరీగా చిత్రీకరించనున్నట్లు తెలుస్తున్నది. మూవీకి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తున్నది. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా ఢిల్లీ బ్యూటీ ఇమాన్ ఇస్మాయిల్ ఎంపిక చేశారు.
మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలోనూ ఇమాన్ ఇస్మాయిల్ పాల్గొన్నది. దాంతో అందరూ ఇమాన్ ఇస్మాయిల్ ఎవరూ అంటూ నెట్టింట ఆరా తీస్తున్నారు. వాస్తవానికి ప్రభాస్ మూవీలో పాకిస్థాన్‌కు చెందిన నటి సాజల్ అలీని తీసుకోనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, యంగ్ రెబల్ స్టార్ సరసన నటించే ఛాన్స్‌ను ఇమాన్ ఇస్మాయిల్‌ను వరించింది. ఇమాన్ ఢిల్లీకి చెందిన యువతి అయినా.. ఆమెకు మూడు దేశాల పౌరసత్వం ఉన్నది. ఆమె సైకాలజీలో డిగ్రీని పూర్తి చేసింది. న్యూయార్క్‌లో మాస్టర్స్ చదివింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెకు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె డ్యాన్సర్ కం కొరియోగ్రాఫ్. ఇన్‌స్టాలో ఆరులక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రభాస్ మూవీతో తొలిసారిగా వెండితెరపై కనిపించబోతున్నది. ప్రస్తుతం ఇమాన్ ఇస్మాయిల్ పేరు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నది.
Dil Raju | ఓటీటీలు అలవాటు చేసి ప్రేక్షకులను మేమే చెడగొట్టాం : దిల్‌రాజు
GOAT Movie Trailer | ఇండియన్ స్పైగా దళపతి విజయ్.. యాక్షన్ ప్యాక్డ్గా ‘గోట్’ మూవీ ట్రైలర్