Ajith Kumar | ప్రముఖ కోలీవుడ్ కథానాయకుడు అజిత్ కుమార్ తాను భవిష్యత్తులో కార్ రేసింగ్‌కు సంబంధించిన చిత్రాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని తాజాగా వెల్లడించారు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘ఎఫ్1 సీక్వెల్’ వంటి చిత్రాల్లో నటించాలని తనకు కోరిక ఉందని అజిత్ తెలిపారు. తన సినిమాల్లోని స్టంట్స్‌ను తానే స్వయంగా చేస్తుంటానని అజిత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒకవేళ హాలీవుడ్ నుంచి పిలుపు వస్తే, రేసింగ్ నేపథ్యమున్న చిత్రాల్లోనూ నటిస్తానని ఆయన అన్నారు. అజిత్ చివరిసారిగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంతో తన అభిమానులను అలరించారు.
రేసింగ్ నేపథ్యంలో సాగే కథలు హాలీవుడ్లో ఎక్కువగా వస్తుంటాయి. ఇండియాలో ఈ తరహా సినిమాలను ప్రయత్నించినా పెద్దగా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అయితే, అజిత్ స్వతహాగా అంతర్జాతీయ రేసర్ కావడం, అలాగే సినిమాల్లో బైక్ స్టంట్స్‌తో పాటు ఇతర సాహస సన్నివేశాలను డూప్ లేకుండా స్వయంగా చేయడం వంటివి ఆయనకు కలిసొచ్చే అంశాలు. అజిత్ లాంటి స్టార్ హీరో ఇలాంటి చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపడం పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరి ఇప్పుడు అజిత్ కోరికను నెరవేరుస్తూ ఏదైనా దర్శకుడు బలమైన స్క్రిప్ట్‌తో ముందుకు వస్తాడో లేదో చూడాలి. అజిత్ లాంటి అగ్రతార రేసింగ్ చిత్రంలో నటిస్తే, అది భారతీయ సినిమాకు ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.