Samantha | వైవిధ్య భరిత పాత్రలను ఎంచుకుంటూ తన నటన, అందంతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత (Samantha). ‘ఏమాయ చేశావే’ సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన సమంత ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. అంతేకాకుండా అత్యధిక పారితోషికం అందుకుంటున్న సౌత్ కథానాయికలలో కూడా సమంత ముందు వరుసలో ఉంది. అయితే, ప్రస్తుతం అనారోగ్యం కారణంగా సినిమాలకు కొంత బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా సామ్‌కు అరుదైన గౌరవం దక్కింది. వుమెన్ ఆఫ్‌ది ఇయర్ అవార్డు (Woman Of The Year Award)ను గెలుసుకుంది. సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక (IIFA Utsavam) అబుదాబి (Abu Dhabi) వేదికగా ఘనంగా జరుగుతోంది. ఈ ఈవెంట్లో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి నటులు హాజరై సందడి చేశారు. ఈవెంట్లో భాగంగా రెండో రోజు స్టార్ నటులు సమంత, రానా, వెంకటేశ్, బాలకృష్ణ, చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వేడుకల్లోనే సామ్‌ను నిర్వాహకులు ప్రతిష్ఠాత్మక ‘వుమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’తో సత్కరించారు.
ఇక ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఐఫా 2024కు గాను ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ (Outstanding Achievement in Indian Cinema) అవార్డును మెగాస్టార్ అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ చేతుల మీదుగా మెగాస్టార్ ఈ అవార్డును అందుకున్నారు. మరోవైపు ఉత్తమ చిత్రం విభాగంలో రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాకు అవార్డు దక్కగా.. ఉత్తమ నటుడు తెలుగు విభాగంలో ‘దసరా’ సినిమాకు నాని అవార్డు అందుకున్నారు.
Also Read..
నా లొకేషన్ ఎలా వచ్చింది.. అదంతా అబద్ధం.. రఘురామకృష్ణ రాజు కేసులో సీఐడీ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Megastar Chiranjeevi | ఐఫా ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
IIFA-2024 | ఐఫా అవార్డు అందుకున్న విజేతలు వీరే.!