IIFA 2024 – | ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుక యూఏఈ రాజధాని అబుదాబిలో అంగరంగా వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం బాలీవుడ్‌కు సంబంధించిన అవార్డులను ప్రకటించగా.. ఈ అవార్డుల్లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సత్తా చాటాడు. జవాన్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. కోలీవుడ్ దిగ్గజాలు ఏఆర్ రెహమన్, మణిరత్నం చేతుల మీదుగా షారుఖ్ ఈ అవార్డును అందుకున్నారు. మరోవైపు టాలీవుడ్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ చిత్రంకు ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. ఇక చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న 12th ఫెయిల్ (12th Fail) సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా విధు వినోద్ చోప్రా అవార్డు అందుకున్నాడు. ఇక ఎవరెవరు ఏ విభాగల్లో అవార్డులు అందుకున్నారు అనేది చూసుకుంటే..
ఉత్తమ నటుడు – షారుఖ్ ఖాన్ (జవాన్)
ఉత్తమ నటి – రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ vs నార్వే)
ఉత్తమ చిత్రం – యానిమల్ (సందీప్ రెడ్డి వంగా)
ఉత్తమ దర్శకుడు – విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ సహాయ నటి – షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ)
ఉత్తమ సహాయ నటుడు – అనిల్ కపూర్ (యానిమల్)
ఉత్తమ విలన్ – బాబీ డియోల్ (యానిమల్)
ఉత్తమ సంగీతం – యానిమల్
ఉత్తమ కథ – రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (కరణ్ జోహార్)
ఉత్తమ లిరిక్స్ – సత్రంగా (యానిమల్)
ఉత్తమ నేపథ్య గాయకుడు – భూపిందర్ బబ్బల్ – అర్జన్ వైలీ (యానిమల్)
ఉత్తమ నేపథ్య గాయని – శిల్పా రావు- చలేయ- (జవాన్)
ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా – జయంతిలాల్ గడ, హేమ మాలిని
సినీరంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన ఘనత – కరణ్ జోహార్