Paradha | మలయాళ నటి, ప్రేమమ్ ఫేం అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) లీడ్ రోల్లో నటిస్తున్న తెలుగు ప్రాజెక్ట్ ‘పరదా’(Paradha). సినిమా బండి ఫేం ప్రవీణ్ కాండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటి దర్శన, సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పరదా ఆగస్టు 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది అనుపమ టీం. కాగా అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ కామెంట్స్‌తో సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది.
రివ్యూయర్లకు డబ్బులు చెల్లించేందుకు కానీ.. రివ్యూలను మార్చేందుకు మా దగ్గర ఎలాంటి వనరులు లేవంది అనుపమ పరమేశ్వరన్. అంతేకాదు పరదా సినిమాకు ఎలాంటి రివ్యూలు వచ్చినా అవి పూర్తిగా స్వచ్చమైనవి. కాబట్టి ఒకవేళ రివ్యూస్ బాగుంటే అందరూ సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి.. రివ్యూస్ బాగా లేకుంటే సంతోషంగా సినిమాను పక్కన పెట్టేయండి అంటూ చెప్పుకొచ్చింది. పరదా సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా అనుపమ పరమేశ్వరన్ చేసిన బోల్డ్ కామెంట్స్‌పై సినిమాకు ఎలా కలిసి వస్తాయనేది చూడాలి మరి.
పరదా చిత్రాన్ని శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. పరదా మలయాళ థ్రియాట్రికల్ హక్కులను పాపులర్ మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సొంతం చేసుకున్నాడని తెలిసిందే. హోంబ్యానర్ వేఫరెర్ ఫిలిమ్స్‌లో ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ విడుదల చేయనున్నాడు. మిస్టికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న పరదా సంప్రదాయపు కట్టుబాట్లు మహిళలను ఎలా అణచివేస్తున్నాయి. ఎలా ఎదగకుండా అణగదొక్కుతున్నాయి.. వాటిని దాటి మహిళలు ఎలా ఎదుగుతున్నారు అనే కాన్సెప్ట్‌తో రాబోతున్నట్లు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది.
Aamir Khan | ‘కూలీ’ సినిమాకు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
Javed Akhtar | దేశద్రోహి అన్న నెటిజన్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జావేద్ అక్తర్
Kangana Ranaut | ఆడవాళ్లనే తప్పుగా చూస్తారు.. పెళ్ళైన వారితో రిలేషన్‌పై కంగనా కామెంట్స్