Ramayana Movie | బాలీవుడ్ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ‘రామాయణ’ (Ramayana) ఒకటి. దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో రూపోందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి, బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, కన్నడ స్టార్ నటుడు యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు దంగల్ సినిమా దర్శకుడు నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నాడు. రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తుంది. కన్నడ స్టార్ నటుడు యష్ రావణుడి పాత్రలో నటించబోతున్నాడు. ఇక హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయి పాత్రలో లారా దత్తా నటిస్తుండగా.. లక్ష్మణుడి పాత్రలో రవి దూబే నటించబోతున్నాడు. రెండు పార్టులుగా ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమా విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా.
రామాయణ్ చిత్రం కేవలం భారతీయ ప్రేక్షకులనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా నిర్మిస్తున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా అన్నారు. హాలీవుడ్ నుంచి వచ్చిన గ్లాడియేటర్, అవతార్ సినిమాల మాదిరిగానే ఈ చిత్రం కూడా భారీ స్థాయిలో ఉండబోతుందని తెలిపాడు. అయితే ఈ సినిమా ఎంత భారీగా తెరకెక్కించిన కూడా హాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చకుంటే ముమ్మాటికి అది మేకర్స్ తప్పేనని నమిత్ మల్హోత్ర తెలిపాడు. అప్పుడు ఈ సినిమా ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనుకుంటానని నమిత్ తెలిపాడు.