నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా రూపొందుతున్న స్పై డ్రామా ‘చైనా పీస్’. అక్కి విశ్వనాధరెడ్డి దర్శకుడు. మూన్ లైట్ డ్రీమ్స్ సంస్థ నిర్మిస్తున్నది. యూనిక్ కాన్సెప్ట్‌తో, యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందుతున్నదని మేకర్స్ తెలిపారు.
త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, గులాసీ, రఘుబాబు, రంగస్థలం మహేశ్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ గరుతు, సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్.