Rajendra Prasad | సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఇంట్లో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి మృతిచెందింది. 38 ఏండ్ల గాయత్రికి గత రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చేర్చారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయారు. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలానే గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
అయితే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించడంతో పాటు రాజేంద్రప్రసాద్‌ను కలిసి ధైర్యం చెబుతున్నారు. తాజాగా నటుడు వెంకటేశ్‌తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా నటకిరిటిని కలిసి పరమర్శించారు. ఇంకా వీరే కాకుండా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో పాటు సాయి కుమార్ ఆమెకు నివాళులు అర్పించారు. మరోవైపు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రాజేంద్రప్రసాద్‌ని కలిసి కూతురు పోయిన బాధలో ఉన్న అతడిని ఓదార్చాడు.
ఎన్టీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ రాసుకోచ్చాడు.
Megastar Chiranjeevi couple paid tribute to Rajendra Prasad’s daughter#RajendraPrasad #Gayatri #actorrajedrapsad #Chiranjeevi #MegastarChiranjeevi #trivikramsrinivas #Viswambhara #Tollywood #Filmify #Filmifyenglish pic.twitter.com/GNt2YAQz7b
— FilmifyOfficial (@FilmifyEnglish) October 5, 2024
Icon star @alluarjun visited #RajendraPrasad garu and his family to personally offer his condolences on the sudden passing of his daughter. pic.twitter.com/N2D6uPxTws
— suresh kavirayani సురేష్ కవిరాయని (@sureshkavirayan) October 5, 2024
#MegastarChiranjeevi condolences to actor #RajendraPrasad on the loss of his daughter during this tough time.💔#Chiranjeevi #Tollywood pic.twitter.com/FiZyXfKm4l
— Karl Marx2.O (@Marx2PointO) October 5, 2024