Sreeleela | శ్రీలీల (Sreeleela).. ఈ పేరు తెలియని వారు ఉండరు. పెళ్లి సందD చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని నెలల క్రితం వరకు వరుస ఫ్లాప్స్ చూసి.. ఇక శ్రీలీల పని అయిపోయింది అనుకున్నారు అంతా. కానీ, ఇటీవలే రిలీజైన ‘పుష్ప 2’లో ఆమె చేసిన ‘కిస్సిక్’ సాంగ్‌తో నేషనల్ వైడ్‌గా విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఈ సాంగ్ తర్వాత ఆమెను అంతా శ్రీలీలకు బదులు ‘కిస్సిక్ లీల’ అని పిలుస్తున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట షేక్ చేసేస్తోంది. ఆమె ఓ బాలీవుడ్ హీరోతో డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
New Couple in the town..#IbrahimAliKhan and #Sreeleela were photographed ….no no Kissik in the city today. ♥️#kissik📷 pic.twitter.com/D0qcMJ2OKd
— Anjali Prakash (@anjaliprakash05) January 7, 2025
శ్రీలీల తాజాగా ముంబైలో దర్శనమిచ్చింది. అక్కడ ఓ రెస్టారెంట్లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ (Ibrahim Ali Khan)తో కలిసి కనిపించింది. వీరిద్దరూ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాకి ఫోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు వీరిద్దరూ కలుసుకోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వీరు ఇప్పుడు ఎందుకు కలుసుకున్నారు..? ఇద్దరూ డేటింగ్లో ఉన్నారా..? అంటూ చర్చించుకుంటున్నారు.
#IbrahimAliKhan and #Sreeleela after a script reading sesh! pic.twitter.com/CfCBwPO7hY
— BollyHungama (@Bollyhungama) January 7, 2025
అయితే, మూవీ విషయమై ఆమె ముంబైకి వెళ్లినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నారు. అక్కడ అనుకోకుండా ఇబ్రహీంని కలుసుకుందని చెబుతున్నారు. అంతకు మించి వారిద్దరి మధ్యా ఎలాంటి రిలేషన్షిప్ లేదని అంటున్నారు. అదే సమయంలో ఇబ్రహీం ఖాన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీం సినిమాలో శ్రీలీలను నటిగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి చర్చల్లో భాగంగానే ఇద్దరూ కలిసినట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు శ్రీలీల ప్రస్తుతం నితిన్‌తో కలిసి రాబిన్ హుడ్, పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తోంది. వీటితోపాటు RT75 ప్రాజెక్ట్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
#Sreeleela cute 🥰 pic.twitter.com/U5fRYCnDN9
— ActressCrze💋 (@ameesha1182274) January 9, 2025
Also Read..
Shraddha Srinath | నా బలమేమిటో తెలుసు.. నటన ద్వారానే ప్రేక్షకులకు గుర్తుండితా: శ్రద్ధా శ్రీనాథ్
Hansika Motwani | హన్సికా మోత్వానీపై గృహ హింస కేసు.. ఇంతకీ ఎవరు పెట్టారంటే..?