నాని (Nani), కీర్తిసురేశ్ (Keerthy Suresh) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం దసరా (Dasara). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. దసరా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న నాని మీడియాతో చేసిన చిట్ చాట్‌లో సినిమా విశేషాలు పంచుకున్నాడు. దసరా గురించి నాని మాటల్లోనే..
దసరా సక్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు..?
ఓ నటుడిగా చాలా సంతోషంగా ఉంది. కానీ దసరా సక్సెస్‌తో సంతృప్తి చెందడం లేదు. భవిష్యత్‌లో నా కొత్త సినిమాకు కూడా ఇదే సమాధానం ఉంటుంది. ఒకవేళ నా పని పట్ల సంతృప్తిగా ఫీలైతే.. ఆ మరుక్షణం బద్దకంగా మారిపోతా. నాలోని ఉత్తమ నటనను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించను.
షూటింగ్ టైంలో ఏ సీన్‌ను బాగా ఎంజాయ్ చేశారు..?
అన్ని సన్నివేశాలను చాలా ఎంజాయ్ చేశా. బెస్ట్ అవుట్‌పుట్ కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. వ్యక్తిగతంగా క్లైమాక్స్ పోర్షన్ షూట్ చేస్తున్నపుడు చాలా ఎంజాయ్ చేశా. ఆ సీన్‌ను ప్రేక్షకులతో కలిసి బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూశా.
ఉత్తరాదిలో కలెక్షన్లు అంతగా రాకపోవడానికి కారణం..?
చూడండి.. నేను అమితాబ్ బచ్చన్‌ను కాదు. ఉత్తరాది జనాలు నన్ను, నా సినిమాలను అంగీకరించేందుకు కొంత సమయం పడుతుంది. మీకు బాగా గమనిస్తే.. ఉత్తరాదిన దసరా కలెక్షన్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అందుకు నాకు సంతోషంగా ఉంది.
దసరా ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది..?
ప్రతీ సినిమా హిట్టయ్యేందుకు డిఫరెంట్ టార్గెట్ ఉంటుంది. క్లాస్ సినిమాను మాస్ సినిమాతో పోల్చి చూడటం ఇద్దరు భిన్నమైన పిల్లలను పోల్చడం లాంటిది. ఏ సినిమానైనా దేనికదే ప్రత్యేకమైన సినిమాగా చూడాలి.
మీ సినిమాల విషయంలో ప్రత్యేకించి ఏదైనా ప్లాన్ చేసుకుంటారా..?
సిల్వర్ స్క్రీన్‌పై నన్ను నేను రిపీట్ చేయాలనుకోవడం లేదు. దసరాతో సహా ఇప్పటివరకు నేనెలాంటి ప్లాన్ వేసుకోలేదు. నాకేది మంచిదనిపిస్తే అది చేస్తా. నేనొక జోనర్‌కు మాత్రమే ఫిక్సవ్వను. దసరా తరహా సినిమాలు చేయాలనుకోవడం లేదు.
దసరా సీక్వెల్ చేసే ఛాన్స్ ఉందని క్లైమాక్స్ హింట్ ఇచ్చిందా..?
కాదు.. ఇది కేవలం సీన్ ముగింపు మాత్రమే. దసరాకు సీక్వెల్ ఉండదు.
Read Also :
Meera Jasmine | క్వీన్ ఎలిజబెత్‌గా పవన్‌కల్యాణ్ హీరోయిన్.. వివరాలివే
Bhuvana Vijayam | సునీల్ భువన విజయమ్ నుంచి కథన కదనమున లిరికల్ వీడియో సాంగ్
Nayanthara | నయనతార కవల పిల్లల పేర్లేంటో తెలుసా..?