మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ (Maa Elections)ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఇవాళ సుమన్ (Suman) మీడియాతో మాట్లాడుతూ…తాను మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని, రెండు పడవల మీద కాలు పెట్టడం ఇష్టం లేదని స్పష్టం చేశారు. అందుబాటులో ఉండలేకపోవడంతో ‘మా’ పోస్టుకు సరైన న్యాయం చేయలేనని, అందుకే మా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సుమన్ చెప్పారు.
మాదక ద్రవ్యాల కేసు (Tollywood drugs case) గురించి మాట్లాడుతూ..డ్రగ్స్ కేవలం సినీ రంగంలో కాకుండా అన్ని చోట్లా ఉన్నాయి. సినీ గ్లామర్ పై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే పబ్లిసిటీ ఎక్కువగా ఉంటుంది. కఠిన శిక్షలు అమలు చేస్తే అరికట్టవచ్చునని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మా అధ్యక్ష ఎన్నికలు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి.
‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితారాజశేఖర్, హేమ, నటుడు, లాయర్ సీవీ ఎల్ నరసింహరావు పోటీ చేస్తున్నారు. అయితే తాజాగా వీరితోపాటు బండ్ల గణేశ్ కూడా చేరిపోవడంతో హాట్ టాపిక్ గా మారాయి మా ఎన్నికలు.
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
Love Story: ప్రమోషన్ స్పీడ్ పెంచిన లవ్ స్టోరీ మేకర్స్..ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..!
Mrunal Thakur | విరాట్ కోహ్లీతో పిచ్చిగా ప్రేమలో పడ్డా: మృణాళ్ ఠాకూర్