‘ఐ – 20’ పేరుతో ఓ చిత్రం రూపొందింది. ‘బివేర్ ఆఫ్ గార్ల్స్’ అనేది ఉపశీర్షిక. సూర్యరాజ్, మెరినాసింగ్ జంటగా నటించారు. సూగూరి రవీంద్ర దర్శకుడు. పి.బి.మహేంద్ర నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని, పాటలను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
నిర్మాతలు కె.ఎల్.దామోదరప్రసాద్, సాయివెంకట్, దర్శకుడు సముద్ర ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ‘ఐ 20’ అందరికీ నచ్చే సినిమా అవుతుందని దర్శక, నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా చిత్ర యూనిట్సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.