Gangs of Godavari | మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) నటిస్తోన్న తాజా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మే 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరికొన్ని గంటల్లో ప్రీమియర్ షోలు, గ్రాండ్ రిలీజ్ ఉన్న నేపథ్యంలో విశ్వక్సేన్ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది.
గోదావరి యాసను ప్రజెంట్ చేసేందుకు తాను 20 రోజులు పనిచేశానని, ఆ భాషలో ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకున్నానని చెప్పాడు. జనాలు విశ్వక్సేన్ కేవలం తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మాత్రమే సినిమాలు చేస్తారని అనకుండా ఉండేందుకు తాను చాలా కష్టపడ్డానని చెప్పాడు. నా యాసలో ప్రేక్షకులు ఎలాంటి తప్పులు గుర్తించరని చాలా నమ్మకంగా ఉన్నా. నేను అన్ని రకాల యాసల్లో సినిమాలు చేయాలని.. నన్ను నేను నిరూపించుకోవాలని చాలా మక్కువతో ఉన్నానని చెప్పుకొచ్చాడు. తాను ఏ యాసనైనా మాట్లాడతానని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిరూపిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు విశ్వక్సేన్.
ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty), అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. మాస్ కా దాస్ కత్తి చేతపట్టుకొని శత్రువులను చీల్చి చెండాతున్నట్టుగా ఉన్న లుక్, హీరోహీరోయిన్ల లిప్‌లాక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. విశ్వక్సేన్ ఈ మూవీలో లంకల రత్నగా కనిపించబోతున్నాడు. ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన సుట్టంలా సూసి పోకలా సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మరోవైపు బ్యాడ్ సాంగ్‌కు కూడా మంచి స్పందన వస్తోంది.
బ్యాడ్ సాంగ్..
మోత లిరికల్ సాంగ్..
పందెంకోడితో విశ్వక్సేన్..
Team #GangsOfGodavari wishes you all a prosperous and delightful Sankranthi! #HappySankranthi 🌾✨
GANGS OF GODAVARI will arrive in theatres on 8th March, 2024! 💥 pic.twitter.com/2hwbtyUOcf
— VishwakSen (@VishwakSenActor) January 15, 2024
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్..
విశ్వక్సేన్, నేహాశెట్టి డ్యాన్స్..