Regina Cassandra | సన్నీడియోల్ కథానాయకుడిగా టాలీవుడ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ ‘జాట్’ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈసినిమాలో నటి రెజీనా కసాండ్రా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇటీవల ముంబయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇందులోని తన పాత్ర గురించి, ‘జాట్’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది రెజీనా. ‘ ‘జాట్’లో నా పాత్ర పేరు భారతి. ఇలాంటి పాత్రను పోషించడం నా కెరీర్లో ప్రధమం.
తెరపై నన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఇదొక విభిన్నమైన కథ. ఒక్క రాత్రిలో జరిగే పెను విస్పోటనం అని చెప్పొచ్చు. సన్నీడియోల్ నట విశ్వరూపం చూస్తారు. లొకేషన్లో ఆయన పెర్ఫార్మెన్స్ చూసి నిజంగా భయమేసింది. ఇక ఆడియన్ ఎలా ఫీలవుతారో అర్థం చేసుకోండి. దేవుడు దిగి వస్తే.. అన్నట్టుగా ఉంటుం ది ఆయన పాత్ర. ఇంతకంటే ఈసినిమా గురించి చెప్పకూడదు. డైరెక్టర్ మలినేని గోపీచంద్‌కి బాలీవుడ్లో పెద్ద బ్రేక్ ఈ సినిమా.’ అని చెప్పింది రెజీనా.