Manoj Bajpai | ప్రేమ కథ, వేదం, హ్యాపీ, కొమురం పులి సినిమాలతో తెలుగులో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా సర్కార్ 3 తర్వాత మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ చిత్రం Police Station Mein Bhoot టైటిల్‌తో వస్తుండగా.. బాలీవుడ్ నటి జెనీలియా దేశ్ ముఖ్ లీడ్ రోల్లో నటిస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం ఒకటి షేర్ చేసుకున్నాడు మనోజ్ బాజ్‌పేయి.
కథ వినకుండానే ఈ సినిమాకు సంతకం చేశానన్నాడు మనోజ్ బాజ్‌పేయి. నా దగ్గర ఓ కథ ఉంది. హైదరాబాద్ రావాలని రాంగోపాల్ శర్మ నన్ను అడిగాడు. నేను పాత్ర ఏంటో కూడా అడగలేదు. వెంటనే వచ్చేస్తానన్నాడు మనోజ్ బాజ్‌పేయి. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్‌లో సెట్స్‌పైకి వెళ్లింది. అయితే మనోజ్ బాజ్‌పేయి ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ కోసం మళ్లీ హైదరాబాద్‌కు రావడంపై చాలా ఎక్జయిటింగ్‌గా ఉన్నాడు. సెకండ్ షెడ్యూల్ నవంబర్ నుంచి షురూ కానుంది.
భయంకరమైన గ్యాంగ్‌స్టర్ ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్టు చేతిలో చనిపోతాడు. అయితే అతడు పోలీస్‌స్టేషన్‌ను వేటాడటానికి ఘోస్ట్ రూపంలో తిరిగొస్తాడు. అందుకే టైటిల్‌ను పోలీస్‌స్టేషన్‌లో భూతం (Police Station Mein Bhoot).. చనిపోయినవారిని నువ్వు అరెస్ట్ చేయలేవు.. అంటూ ఆర్జీవీ కొన్ని రోజుల క్రితం సినిమా లాంచ్ సందర్భంగా ఎక్స్‌లో సినిమా ప్లాట్ గురించి షేర్ చేసిన విషయం తెలిసిందే. మనోజ్ బాజ్‌పేయి, ఆర్జీవీ 1998లో వచ్చిన కల్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సత్యకు కలిసి పనిచేశారని తెలిసిందే.
Sai Pallavi | SIIMA Awards వేడుకలో పింక్ సారీలో మెరిసిన సాయిపల్లవి.. పిక్స్ వైరల్