Kiran Abbavaram | టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం నటిస్తోన్న చిత్రం కే-ర్యాంప్ (K Ramp). యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
అయితే టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించి మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేశాడు కిరణ్ అబ్బవరం. శ్రీకాంత్ అడ్డాల మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ లైన్లో ఉంది. నాకు కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలంటే చాలా ఇష్టం. శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా లాంటి జోనర్ కథతో నా దగ్గరకు వచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. మీ నుంచి అందరూ ఆశించేవి ఇలాంటి సినిమాలే అని శ్రీకాంత్ అడ్డాలతో చెప్పానన్నాడు.
ఇక ఈ సినిమా పక్కా విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. యాక్టర్ రానా దగ్గుబాటి ఈ చిత్రానికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నాడట. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుందట.
కిరణ్ అబ్బవరం మరోవైపు ఓ వెబ్ సిరీస్‌ను కూడా చేయబోతున్నట్టు చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చేశాడు.
Srinidhi Shetty | సిద్ధు పాత్రతో ప్రేమలో పడిపోతారు.. తెలుసు కదా సినిమాపై శ్రీనిధి శెట్టి
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం వెబ్‌సిరీస్ జోనర్ ఇదేనట..!
Deepika Padukone | పనిగంటల వివాదం.. తొలిసారి స్పందించిన దీపికా పదుకొణే