Rules Ranjann | స్క్రిప్ట్ వినగానే రెండు గంటలపాటు నవ్వాను : కిరణ్ అబ్బవరం
Rules Ranjann | కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్ (Rules Ranjann). సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రూల్స్ రంజన్ టీం ప్రెస్ మీట్ ఈవెంట్ నిర్వహించింది.
Rules Ranjann | ఎస్ఆర్ కల్యాణమండపం ఫేం కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్ (Rules Ranjann). రుథిరమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. రూల్స్ రంజన్ సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రూల్స్ రంజన్ టీం ప్రెస్ మీట్ ఈవెంట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. రూల్స్ రంజన్ ఏడాది కిందటే మొదలైంది. స్క్రిప్ట్ వినగానే కంటిన్యూగా రెండుగంటలపాటు నవ్వాను. మీరు ఖచ్చితంగా థియేటర్లో అలానే ఎంజాయ్ చేస్తారు. నేనిందులో మనోరంజన్, రూల్స్ రంజన్‌గా కనిపిస్తా. నా పాత్ర చాలా ఆసక్తికరంగా సాగుతుంది. మనోరంజన్ మనలో ఒకడిగా ఉంటాడు.మీరంతా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా గురించి ముందు ముందు ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి. వాటిలో చాలా మాట్లాడతాను. స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను చాలా బాగా సపోర్ట్ చేశారు.
ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే నాలో నేనే లేను (Naalo Nene Lenu promo), సమ్మోహనుడా పాటలు లాంఛ్ చేయగా.. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. రూల్స్ రంజన్ చిత్రాన్ని సలార్ పార్టు 1 విడుదలయ్యే తేదీ (సెప్టెంబర్ 28)నే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్.
ఈ చిత్రానికి అమ్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీని ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి తెరకెక్కిస్తున్నారు. రూల్స్ రంజన్ చిత్రంలో మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్దార్థ్ సేన్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కిరణ్ అబ్బవరం దీంతోపాటు KA9 ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తున్నాడు.
“I laughed for the entire 2 hours while listening to the script”😆
Hero @Kiran_Abbavaram confident words at #RulesRanjann Press Meet 🔥
Worldwide Release on Sep 28th🤩 @iamnehashetty @rathinamkrish @AmrishRocks1 @DivyangLavania @MuraliKVemuri @rinkukukreja @venupro @ItsChavan… pic.twitter.com/Mw1a34f1XX
— BA Raju’s Team (@baraju_SuperHit) September 4, 2023
The world of #RulesRanjann is here to entertain you all 🥁🥳
Worldwide grand release on September 28th 💥@Kiran_Abbavaram @iamnehashetty @rathinamkrish @AmrishRocks1 @DivyangLavania @MuraliKVemuri @rinkukukreja pic.twitter.com/F1FdtiNnpi
— starlightentertainment pvtltd (@starlightenter8) September 4, 2023
సమ్మోహనుడా సాంగ్..
నాలో నేనే లేను సాంగ్ ప్రోమో..
నాలో నేనే లేను లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

