యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకుంటా!
‘ఈ సినిమా ఏపీ, తమిళనాడు సరిహద్దులోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో హిజ్రాలకు సంబంధించిన ఓ పాయింట్‌ను తీసుకున్నాం. ట్రాన్స్‌జెండర్స్ అంశం కథలో సంఘర్షణకు కారణమవుతుంది’ అన్నారు రక్షిత్ అట్లూరి. ‘పలాస’ చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నరకాసుర’.
‘ఈ సినిమా ఏపీ, తమిళనాడు సరిహద్దులోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో హిజ్రాలకు సంబంధించిన ఓ పాయింట్‌ను తీసుకున్నాం. ట్రాన్స్‌జెండర్స్ అంశం కథలో సంఘర్షణకు కారణమవుతుంది’ అన్నారు రక్షిత్ అట్లూరి. ‘పలాస’ చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్ నోవా అకోస్టా దర్శకుడు. త్వరలో విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో రక్షిత్ అట్లూరి పాత్రికేయులతో మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను లారీ డ్రైవర్ శివ పాత్రలో కనిపిస్తాను.
కథలో నరకాసురుడికి సంబంధించిన అంశాలేవి ఉండవు. రాక్షసుల్ని చంపాలంటే మనం అంతకంటే చెడ్డగా ఉండాలనే పోలికతో ఈ టైటిల్ పెట్టాం. కరోనా కారణంగా సినిమా పూర్తికావడానికి రెండున్నరేళ్ల సమయం పట్టింది. ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో చిత్రీకరణ జరిపాం. 20 రోజుల పాటు చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తుంది. అన్ని భాషలకు కనెక్ట్ అయ్యే సినిమా కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నాం. ‘పలాస’లో యాక్షన్ సీన్స్ బాగా చేశాననిపించింది. మంచి యాక్షన్, మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలనుంది. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ అయ్యాయి’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

