పెళ్లైన కొత్తలో సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసి..తన యాక్టింగ్తో ఫాలోవర్ల సంఖ్యను భారీగానే పెంచేసుకుంది కోలీవుడ్ (Kollywood) భామ ప్రియమణి (Priyamani). ఈ బ్యూటీ పెళ్లయిన తర్వాత కూడా సక్సెస్ ఫుల్గా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్లాన్ చేసుకుని ముందుకెళ్తుంది. తాజాగా ప్రియమణి చెఫ్ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఆహా ప్రాజెక్టు భామా కలాపం (bhama kalapam). ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పై సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. ఇందులో కుకరీ షో చేసే అనుపమ పాత్రలో నటిస్తోంది. రీల్ లైఫ్ అనుపమకు రియల్ లైఫ్ ప్రియమణికి పొంతన లేదని చెప్తోందీ భామ.
నేను వెబ్ సిరీస్లో కనిపించే అనుపమలా ఉండను. ఆమె (ప్రియమణి)కు వంట తెలియదని చెప్పింది. నాకు వంట ఎలా చేయాలో తెలియదు. కానీ నా భర్త అన్ని వంటలు చేస్తారు..నేను కూడా అన్ని వంటలు ఆరగిస్తాను. వెబ్ సిరీస్లో అనుపమలా ముక్కుసూటిగా ఉండను. నాకు నచ్చినట్టుగా నా సొంత జీవితానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నా. సాధారణంగానే నేను గూటి పక్షిని. అవసరమైతే కానీ బయటకు వెళ్లను. అనుపమలా ఉండాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది.
వ్యక్తిగత జీవితంపై వచ్చే పుకార్ల గురించి స్పందిస్తూ..వాటిని ఎదుర్కొనడం నేర్చుకున్నా. ఆ గాసిప్స్ పై ఎక్కువగా స్పందిస్తే వాటికి తెలియకుండానే ఆజ్యం పోసినట్టవుతుంది. ఓ వైపు నుంచి తెలుసుకుని, మరోవైపు వదిలేయాలి. ఒకవేళ పుకార్లలో ఏదైనా నిజముంటో ముందుగా మీ కుటుంబానికి, భర్తకు సమాధానం చెప్పుకుంటే చాలు. ప్రపంచానికి జవాబుదారిగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.