Bhamakalapam Trailer | ఒక్క గుడ్డు రూ.200 కోట్లా..? ప్రియమణి భామా కలాపం ట్రైలర్
ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం భామా కలాపం (Bhamakalapam). ఈ మూవీ ట్రైలర్ (Bhamakalapam Trailer) ను విజయ్ దేవరకొండ లాంఛ్ చేశాడు.

టాలీవుడ్ నటి ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం భామా కలాపం (Bhamakalapam). తెలుగు ఓటీటీ ప్లాట్ఫాంలో ఫిబ్రవరి వస్తున్న చిత్రాల్లో ఒకటి. ఈ మూవీ ట్రైలర్ (Bhamakalapam Trailer) ను విజయ్ దేవరకొండ లాంఛ్ చేశాడు. ఇందులో అనుపమ అనే వంటల ప్రోగ్రాం నిర్వహించే వ్యక్తిగా ప్రియమణి కనిపించనుంది. తన యూట్యూబ్ ఛానల్లో రకరకాల రుచికరమైన వంటలుచేస్తూ..కేవలం వాసనతో వంటకం ఎలా ఉందో చెప్పగల టాలెంట్ అనుపమ సొంతం.
అయితే హఠాత్తుగా ఓ గుడ్డు కనిపించకపోవడంతో అనుపమ లైఫ్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయనేది ట్రైలర్లో చూపించారు. కేవలం వాసన చూసి కూరలో ఉప్పెక్కువైందో..తక్కువైందో చెప్పేస్తానే..దేవుడిచ్చిన గిఫ్ట్ అది..నేను పసిగట్టింది తప్పయే ఛాన్సే లేదు.
కోల్కతా మ్యూజియంలో అపహరణకు గురైన ఫ్యాబర్జే ఎగ్ స్థానంలో డూప్లికేట్ ఎగ్ పెట్టిన విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు మ్యూజియమ్ అధికారులు..అని న్యూస్ హెడ్ లైన్ లో రావడం, ఆ గుడ్డు ఏమైందో దర్యాప్తు చేసే క్రమంలో ప్రియమణి ఇంటిని సీజ్ చేయడం, ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ప్రియమని గృహిణిగా తన పాత్రలో జీవించేసినట్టు ట్రైలర్తో అర్థమవుతుంది. అభిమన్యు డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టు ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

