అమరావతి : ఏపీలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను చర్చించేందుకు సీఎం జగన్ ఆహ్వానం మేరకు ఇండస్ట్రీ బిడ్డగా తాడెపల్లికి వచ్చానని ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. కొవిడ్ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాదానమిస్తూ గంట, గంటన్నరలో అన్ని విషయాలు మీడియాకు వివరిస్తానని పేర్కొన్నారు.
ఏపీలో సినిమా టికెట్ల విషయంపై సీఎం జగన్ తో చర్చించనున్నారు. సినీ పరిశ్రమ, అధికార పార్టీ ప్రతినిధుల మధ్య టికెట్ల వివాదం రోజురోజుకూ ముదురుతున్న కారణంగా సీఎంతో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. టికెట్ల వ్యవహారమే కాకుండా ఇతర సమస్యలను కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.