Prakash Raj | ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రామాయణం, హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీనిచ్చాడు ప్రకాశ్‌రాజ్. ఇటీవల జరిగిన ఒక సాహితీ కార్యక్రమంలో తాను చేసిన ప్రసంగంపై సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ.. తన మాటలను కొందరు కావాలనే వక్రీకరించారని, పూర్తి ప్రసంగాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం కొన్ని భాగాన్ని మాత్రమే తీసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తానేదో శ్రీరాముడిని తప్పుగా మాట్లాడానని, హిందువుల మనోభావాలను గాయపరిచానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని ధర్మాలను గౌరవించే తనకు ఎవరినీ తక్కువ చేసే ఉద్దేశం లేదని, తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కొందరు రాజకీయ నాయకులు తనపై ‘హిందూ వ్యతిరేకి’ అనే ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. సమాజంలోని లోపాలను ప్రశ్నించే తన గొంతును నొక్కేందుకే ఈ విధమైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను పొలం పనుల్లో బిజీగా ఉన్నానని ఈ పని అయ్యాక మీ వద్దకు వస్తానంటూ చెప్పుకొచ్చాడు.
To all the desperate bigots #justasking pic.twitter.com/zGLpbEOcYp
— Prakash Raj (@prakashraaj) April 19, 2026