మక్కా శ్రీను, సుచిత్ర రాథోడ్ జంటగా రూపొందిన చిత్రం ‘ఎస్.ఐ.కోదండపాణి’. రెంటాల నాగేంద్ర దర్శకుడు. మక్కా శ్రీదేవి నిర్మాత. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అతిత్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రిమియర్‌ను హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్లో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నిర్మాత లయన్ సాయివెంకట్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. తమకు సంబంధంలేని హత్యానేరంలో ఇరుక్కున్న ముగ్గురు స్నేహితులు.. మళ్లీ ఎలా బయటపడ్డారు? అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా అని, నిర్మాతల సహకారం వల్లే ఈ సినిమా అనుకున్నట్టు పూర్తి చేయగలిగానని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ మాట్లాడారు.