SSMB 29 | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu) ప్రస్తుతం గుంటూరుకారం సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28గా వస్తోన్న ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకముందే ఎస్ఎస్ఎంబీ 29 (ssmb29) కు సంబంధించిన అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు షురూ చేశాడట.
ముందుగా భారీ సెట్లో షూటింగ్‌కు ప్లాన్ చేస్తుండగా.. దీని కోసం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్టు వేసే ప్లాన్‌లో ఉన్నట్టు టాలీవుడ్ సర్కిల్లో వార్తలు రౌండప్ చేస్తున్నాయి. అంతేకాదు ఈ సెట్లోనే ఎక్కువభాగం షూటింగ్ జరుగనుందట. ఈ సెట్‌తోపాటు ఆఫ్రికా, యూరప్‌లో జక్కన్న టీం ప్లాన్ చేస్తుందని ఇన్ సైడ్ టాక్. జక్కన్న లొకేషన్లను ఫైనల్ చేయడమే కాకుండా.. ఈ ఏడాది సమ్మర్లో షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే మహేశ్ బాబు అభిమానులను ఇంతకన్నా పెద్ద గుడ్‌న్యూస్ ఏముంటుంది చెప్పండి. మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయన్నమాట.
ఎస్ఎస్ఎంబీ 29లో మహేశ్ బాబు రోల్ లార్డ్హనుమాన్ స్ఫూర్తిగా జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగనుందని నెట్టింట ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తున్నాయని తెలిసిందే. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా ఎస్ఎస్ఎంబీ 29 ఉండబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ ఆక్. కథానుగుణంగా అమెజాన్ ఫారెస్ట్‌లో వచ్చే అడ్వెంచరస్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్‌గా నిలువబోతుందని టాక్. ఇప్పటికే విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ అభిమానులకు మహేశ్ బాబు కావాల్సిన ఫుల్ మీల్స్ అందివ్వబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తుంది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..
As of now only @ssrajamouli’s #SSMB29 has potential to drag international audience to watch telugu movies in theatres – @Shobu_ ❤️🔥
MOST ANTICIPATED FILM OF INDIAN CINEMA 😎 pic.twitter.com/TqnxIurIEM
— VardhanDHFM (@_VardhanDHFM_) November 26, 2023